బీసిసిఐని కోరిన జమ్మూకాశ్మీర్ సిఎం
రసూల్‌కు ఒక్క అవకాశమివ్వండి
జమ్మూ ,ఆగష్ట్ 2 (ఆర్‌ఎన్‌ఎ):
జింబాబ్వేతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో తమ ఆటగాడు పర్వేజ్ రసూల్‌ను ఒక్క మ్యాచ్ కూడా ఆడిం చకపోవడం నిరాశను కలిగించిం దని జమ్మూకాశ్మీర్ ముఖ్యంమంత్రి ఒమర్ అబ్దు ల్లా వ్యాఖ్యానించారు. రసూల్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని బీసిసిఐని కోరారు. తనను నిరూపించు కునేం దుకు చివరి వన్డేలోనైనా రసూల్‌ను ఆడించాలంటూ తన ట్విట్టర్ పేజీలో కామెంట్ పోస్ట్ చేశారు. సిరీస్ గెలుచుకున్న తర్వాత కూడా రసూల్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవడం తనను నిరాశపరిచిందని చెప్పారు. జమ్మూ నుండి భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా పర్వేజ్ రసూల్ రికార్డ్ సృష్టించాడు. అయితే నాలుగు వన్డేల్లోనూ అతనికి చోటు దక్కలేదు. దీంతో చివరి వన్డేలో రసూల్ వన్డే అరంగేట్రం చేయొచ్చని భావిస్తున్నారు.