ఘనంగా చద్రాచలంలో శ్రావణమాస పూజలు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. ఈ రోజు శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో క్షేత్రంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీసీతారామ చంద్రస్వామి వారి సన్నిదిలో ఈ రోజు బేడ మండపంలోని లక్ష్మీ అమ్మవారికి పంచామృతాలతో అర్చకుల, వేదపండితుల మంత్రోచ్చరణలతో, భక్తుల శ్రీరామనామ జయ జయ నామ స్మరణల నడుమ అభిషేకం నిర్వహించారు. శ్రావణమాస విశిష్టతకు రామాలయ ప్రధాన అర్చకులు జగన్నాథచార్యులు భక్తులకు వివరించారు.