అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం

` నా ఆధ్వర్యంలో అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే లక్ష్యం
` నాగమల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిరచిన ట్రంప్‌
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడిరచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని అన్నారు. అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అన్నారు. డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబా వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్‌ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హావిూ ఇచ్చారు. ’ఇకపై అక్రమ వలసదారులపై మెతకవైఖరి అవలంబించబోమని స్పష్టం చేశారు. ’చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి. డాలస్‌లో మల్లయ్యకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. మా దేశానికి సంబంధం లేని, క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు’ అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికలో పోస్టు పెట్టారు. గతంలో బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినెజ్‌ అమెరికాలో నివసించేందుకు దోహదపడిరదని ట్రంప్‌ విమర్శించారు. అతడికి నేరచరిత్ర ఉన్నా.. నివాసానికి అనుమతించారని ధ్వజమెత్తారు. ’ఈ వ్యక్తి క్రూరమైన నేరాలకు పాల్పడి గతంలోనే అరెస్టయ్యాడు. చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనం తదితర కేసులు అతడిపై నమోదయ్యాయి. అలాంటి వ్యక్తిని బైడెన్‌ మా గడ్డ విూదకు తీసుకొచ్చారు. ఎందుకంటే క్యూబా ఇలాంటి దుష్టులను తమ దేశంలో ఉంచుకోవాలను కోలేదు. అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోను’ అంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 10న ఓ మోటెల్‌లో నాగమల్లయ్య హత్యకు గురయ్యారు. క్యూబాకు చెందిన యోర్డానిస్‌ కోబోస్‌ మార్టినెజ్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నాగమల్లయ్య తల నరికి మరీ దానికి చెత్తబుట్టలో వేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది.

 

 

త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం?
` భారత్‌కు రానున్న అమెరికా ప్రతినిధి
` నేడు ఇరు దేశాల మధ్య చర్చలు
వాషింగ్టన్‌(జనంసాక్షి):అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల మోత మోగించడంతో భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో (%ుతీaసవ ుaశ్రీసం%) అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు వాటిలో కదలిక రానున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు రాత్రికి అమెరికా ప్రతినిధి భారత్‌కు రానున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులు మీడియాకు వెల్లడిరచారు. దాంతో మంగళవారం రెండు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయని పేర్కొన్నాయి. మార్చి నుంచి ట్రేడ్‌ డీల్‌ కోసం అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు ఇరు దేశాల ప్రతినిధులు ఐదు దఫాలుగా చర్చించారు. ఆరవ రౌండ్‌కోసం ఆగస్టు 25న యూఎస్‌ బృందం భారత్‌కు వస్తుందని భావించారు. కానీ సుంకాల ఎఫెక్ట్‌తో ఆ పర్యటన కాస్తా రద్దయింది. అయితే ఒప్పందంలో మొదటి దశను ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలాఉంటే.. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్రంప్‌ పోస్ట్‌ పెట్టగా.. తాను కూడా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని మన ప్రధాని బదులిచ్చారు. ఈ నేపథ్యంలో యూఎస్‌ ప్రతినిధి భారత్‌ పర్యటన చోటుచేసుకుంటోంది.రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న విధానాలపై ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో (%ూవ్‌వతీ చీaఙaతీతీశీ%) పదే పదే నోరుపారేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల వేళ.. నవారో మళ్లీ స్పందించారు. చర్చలకు భారత్‌ను ఒప్పించామనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరుదేశాల మధ్య చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్నాయని, ఇరుపక్షాలు సంతృప్తికరంగా ఉన్నాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల పేర్కొన్నారు. మొదటి విడత ఒప్పందం నవంబర్‌ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. వీటికి సంబంధించి చర్యలు చేపట్టాలని ఈ ఫిబ్రవరిలో భేటీ సందర్భంగా ట్రంప్‌-మోదీలు తమ ప్రతినిధి బృందాలను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం భారత్‌ ఎగుమతులపై 50 శాతం అమెరికా సుంకాల భారం పడుతోంది.