జార్ఖండ్ మావోయిస్టు పార్టీకి భారీ నష్టం
` ముగ్గురు మావోయస్టుల మృతి
` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్
రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో హజారీబాగ్ జిల్లాలో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. వీరిలో సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్ కూడా ఉన్నారు. 209 బెటాలియన్ కోబ్రా దళాలు గోర్హర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో జాయింట్ ఆపరేషన్ చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకొంది. సహదేవ్ సోరెన్‌ను మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా భావిస్తున్నారు. ఆయనపై రూ.1 కోటి రివార్డు ఉంది. ఇక మరో మావోయిస్టు రఘునాథ్ హేమంబరం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు. అతడిపై రూ.25 లక్షల బహుమతి ఉంది. ఇక జోనల్ కమిటీ సభ్యుడు విర్సెన్ గంజూ కూడా వీరిలో ఉన్నాడు. అతడిపై ప్రభుత్వం రూ.10లక్షల బహుమతిని ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా తాము మూడు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడిరచారు. భద్రతా దళాలు ఆ ప్రదేశంలో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నాయి. జులైలో ఓ కోబ్రా జవాన్ హత్యలో సహదేవ్ పేరు వచ్చింది. నాడు బొకారో పోలీసులు చేపట్టిన సెర్చి ఆపరేషన్ సందర్భంగా తగిలిన తూటా గాయానికి అతడు మరణించాడు. తాజాగా ఈ ముగ్గురు మావో నేతలు ఏదో పెద్ద ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తున్నట్లు ఎస్పీ హర్వీందర్ సింగ్ వెల్లడిరచారు. సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన ఓ ఆపరేషన్‌లో మావోయిస్టుల సీనియర్ నాయకుడు అమిత్ హన్స్‌డా మరణించాడు. జోనల్ కమాండర్ అయిన అతడిపై రూ.10 లక్షల రివార్డు ఉంది. మొత్తం 95 కేసుల్లో అతడు నిందితుడు. వీటిల్లో చాలామంది పోలీసులు, పౌరుల హత్యలు ఉన్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కూడా మావోయిస్టుల ఏరివేత శరవేగంగా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు మోడెం బాలకృష్ణ, అల్వాల్ చంద్రహాస్ సహా 10 మందిని ఎన్‌కౌంటర్ చేశారు.