ఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో చొరబాటుకు యత్నించిన తీవ్రవాదుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. భారత సరిహద్దులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు తీవ్ర వాదులను కాల్చిచంపినట్లు సైన్యం ప్రకటించింది.