జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని

న్యూఢిల్లీ: 67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు. తొలుత బాపూఘాట్‌ వద్ద మహాత్మగాంధీకి నివాళుర్పించాన అనంతరం ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోని స్వాగతం పలికారు. అనంతరం ఎర్రకోట పైకా చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో యూపీఏ ఛైన్‌పర్సన్‌ సోనియా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.