భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర
నేతాజీకి నమ్మకమైన సహచరులు
ఈ విధంగా ఎప్పటికప్పుడు జాతీయోద్యమంలోని అన్ని ప్రధాన ఘట్టాలలో ముస్లిమేతర జనసముదాయాలతో పాటుగా తమదైన భాగస్వామ్యాన్ని నిర్వర్తించిన ముస్లిం సమాజం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెంట కూడా అదే స్థాయిలో తన పాత్రను నిర్వహిం చింది. నేతాజీ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో అనేకమంది ముస్లింలు ప్రధాన బాధ్యతలను నిర్వర్తించారు. మాతృభూమి సేవలో కర్తవ్యనిర్వహణ కొనసాగిస్తూ అమరులయ్యారు.
ఆజాద్ హింద్ ఫౌజ్‌లో జనరల్‌గా షానవాజ్ ఖాన్, కల్నల్‌గా అజీజ్ అహమ్మద్, యం కె ఖైనీలు ప్రధాన బాధ్యతలు నిర్వహిం చారు. హైదరాబాద్ వాసులైన మహమ్మద్ అయూబ్, ఖమరుల్ ఇస్లాం, తాజుద్దీన్ గౌస్ వంటి యువకిశోరాలు నేతాజీ వెంట నడిచా రు. ఈ పోరాటం విఫలం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రముఖులైన జనరల్ ఫానవాజ్‌ఖాన్, కెప్టెన్ వికె సెహగల్, లెఫ్టినెంట్ జియస్ థిల్లాస్‌ల మీద రాజద్రోహం నేరం మోపి విచార ణకు ఆదేశించింది.
ఈ యోధుల పక్షాన వాదించేందుకుగాను అబుల్ కలాం ఆజాద్ తగిన ఏర్పాట్లు చేయించారు. ఆ సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా జనరల్ షానవాజ్ ఖాన్‌కు ఒక సందేశం పంపారు. రాజద్రోహం నేరం క్రింద విచారణకు గురైన మిగిలిన సహచరుల నుండి వేరుపడితే జనరల్ పక్షాన తాను కేసు వాదించడానికి సిద్దమని జిన్నా తెలిపారు. అందుకు జనరల్ షానవాజ్ అంగీకరించలేదు.
జిన్నాకు సమాధానంగా ‘స్వాతంత్య్ర సమరంలో మేం భుజం కలిపి పోరాడాం. మా నాయకత్వ స్ఫూర్తితో మా కామ్రేడ్స్ యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు వదిలారు. నిలబడినా, నేలకూలిన కలిసే ఉంటాం, అని జనరల్ షానవాజ్ స్పష్టం చేశారు.
(…షవ ష్ట్రaఙవ ర్‌శీశీస రష్ట్రశీబశ్రీసవతీ ్‌శీ రష్ట్రశీబశ్రీసవతీ ఱఅ ్‌ష్ట్రవ ర్‌తీబస్త్రస్త్రశ్రీవ టశీతీ టతీవవసశీఎ. వీవ షశీఎతీaసవర ష్ట్రaఙవ సఱవస శీఅ ్‌ష్ట్రవ టఱవశ్రీస శీట పa్‌్‌శ్రీవ ఱఅరజూఱతీవస పవ శీబతీ శ్రీవaసవతీరష్ట్రఱజూ షవ ర్‌శీశీస శీతీ శీతీ టaశ్రీశ్రీ ్‌శీస్త్రవ్‌ష్ట్రవతీ..)
ఈ విచారణ సందర్భంగా ఆజాద్ హింద్ ఫౌజ్ యోధులకు శిక్షలు పడితే సహించేదిలేదని ప్రజలు ప్రకటించారు. అప్పటికీ రషీద్ అలీ అను వీరజవానుకు ఏడు ఏండ్ల జైలు శిక్ష విధించగా ప్రజలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు.
నేతాజీ సన్నిహిత సహచరులైన అక్బర్‌షా, 1941లో బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళుగప్పి నేతాజీ ఇండియా నుండి తప్పించుకొని వెడుతు న్నప్పుడు ఆయన వెంట ఉన్నారు. నేతాజీ బెర్లిన్ నుండి చాకకచ క్యంగా తప్పించుకున్న సాహసఘట్టంలో ఆయనతోపాటు 90 రోజుల పాటు సబ్‌మెరైన్‌లో గడిపిన వ్యక్తిగా ఆయన కార్యదర్శి అబిద్ హుస్సేన్ సఫ్రాని అపూర్వ గౌరవాన్ని పొందారు. నేతాజీ టోక్కో నుండి ప్రయాణమైన విమానంలో ఆయన వెంట ఉండి వీరమరణం పొందిన వ్యక్తులలో కల్నల్ హబీబుర్ రహమాన్ ఒకరు.
ఆ నాడు ‘..మీ రక్తం నాకివ్వండి..మీకు నేను స్వాతంత్య్రాన్నిస్తాను..’ అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాన్ని గౌరవిస్తు మాతృదేశ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో నేలకొరిగిన యోధులలో కొందరి గురించి ఖీ=జుజుణూవీ వీూహజువీజుచీు ూచీణ IచీణIూచీ వీఖూకూIవీూ లో గ్రంథ రచయిత ూూచీుIవ్‌ీూ=ూ్ క్లుప్తంగా పేర్కొన్నారు.
ఆ నమోదు ప్రకారం పోరాటంలో అమరులైన వారిలో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ అబ్దుల్ రహమాన్ ఖాన్, అహ్మద్ ఖాన్, అఖ్తర్ అలీ, అల్లావుద్దీన్ (హర్యానా కపుర్తలా), అల్తాఫ్ హుస్సేన్(అమృతసర్), బషీర్ అహమ్మద్(హర్యానా-రోధక్), చిరాగుద్దీన్ (పంజాబ్-లూథియానా), బషీర్ అహమ్మద్ (పంజాబ్- సియాల్‌కోట్), ప్రస్తుత పాకిస్థాన్‌లోని జెహాలమ్‌కు చెందిన దిలావర్ ఖాన్, ఫతేఖాన్, ఫతే మహమ్మద్ (హర్యానా- రోథక్), పతే మముహమ్మద్ (పంజాబ్-హోషియాపూర్), ఫజల్ ఖాన్ (పాకి స్థాన్-జెహలం), గులాంనబి (పంజాబ్-గురుదాస్ పూర్), ఇనాయ తుల్లా (వాయువ్య సరిహద్దు రాష్ట్రం-పెషావర్), ఇర్షాద్ అలీ (హర్యానా-రోథక్), జమాలుద్దీన్ (పంజాబ్-కపుర్తలా), ఖాశీం అలీ (హర్యానా-హిస్హార్), మహమ్మద్‌ఖాన్ (పాకిస్థాన్- నూర్‌పూర్), ఖుదా బక్ష్ (పాకిస్థాన్-కాంబెల్లాపూర్), ఖాశిం అలీ (హర్యానా హిస్సార్), మహమ్మద్ ఖాన్ (పాకిస్థాన్-నూర్‌పూర్), ఖుషీ మహమ్మద్(పంజాబ్-లూథియానా), లాల్‌ఖాన్ (పంజాబ్-జెహలం), మహమ్మద్ అబ్బాస్ (రావాల్సింది) మహ్మద్ అఫజల్ (రావల్సింది), బసమ్దద్ తీన్ (పంజాబ్-సియాల్‌కోట), మహమ్మద్ అలీ (పాకిస్థాన్- లాహోర్), మహమ్మద్ షఫీ (పంజాబ్-జలంధర్), మహమ్మద్ ఉమర్ ఖాన్ (హర్యానా-రోథక్), మహమ్మద్ యాకుబ్ (వాయువ్య సరిహద్దు రాష్ట్రం-కోహట్) నబీ బక్ష్ (పంజాబ్ -కపుర్తలా) నూర్ హుస్సేన్ (పంజాబ్-కాని) తదితరులు ఉన్నారు.
ఆజాద్ హింద్ ఫౌజ్‌లో వివిధ పదవులు నిర్వహించి మాతృభూమి విముక్తి పోరాటంలో పునీతులైన వందలాది వీరయోధులలో నక్కీ అహ్మద్ అలీషా, అటా మహమ్మద్, అహమ్మద్ ఖాన్, ఎకె మీర్జా, అబూఖాన్, యస్ అఖ్తర్ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్ రహమాన్ ఖాన్ ఉన్నారు. మన హైదరాబాద్‌కు చెందిన అబిద్ హసన్ సఫ్రాని తో పాటుగా ఖమ్రుల్ ఇస్లాం, తాజుద్దీన్ లాంటి యోధులు పలువు రున్నారు.
తుది తిరుగుబాటులోనూ త్యాగాలు
భారత స్వాతంత్రోద్యమంలో చివరి ఘట్టంగా పేర్కొనదగినది రాయల్ ఇండియన్ నౌకాదళం తిరుగుబాటు. 1946 ఫిబ్రవరి మాసంలో జరిగిన ఈ తిరుగుబాటు, ఆనాటి బ్రిటిష్ పాలకుల తీవ్ర జాతి వివక్షతకు నిరసనగా మారింది. వివక్షకు వ్యతిరేకంగా విజ్ఞప్తులు, మహజర్లు సమర్పించినప్పటికి బ్రిటిష్ పాలకుల నుండి ఎటువంటి స్పందన లేకపోవటంతో విసుగు చెందిన రాయల్ ఇండియన్ నౌకాదళంలోని భారతీయ పిసాయీలూ, అధికారులు ప్రత్యక్ష చర్యకు పూనుకున్నారు.
ఈ మేరుకు విధులకు గైర్హాజరై సభలు, సమావేశాలు జరుపుతున్న సైనికులకు ప్రజానీకం మద్దతు లభించటంతో తిరుగుబాటు ఉధృత రూపం దాల్చింది. బొంబాయి, కరాచి, కలకత్తా, ఢిల్లీ, కొచ్చిన్, జమానగర్, అండమాన్ తదితర ప్రాంతాలలో తిరుగుబాటు ప్రభా వం చాలా తీవ్రంగా కన్పించింది. ఆయా ప్రాంతాలలో 78 నౌకలు, 20కు పైగా స్థావరాలు పూర్తిగా స్థంభించాయి. బ్రిటిష్ పాలకులపై 1857లో తొలిసారిగా పిసాయిల తిరుగుబాటు జరిగాక, తిరిగి 1940లో సిపాయిలు తిరుగుబాటు చేయటంతో ఖంగుతిన్న బ్రిటిష్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో వందలాది ప్రజలు, ఉద్యమకారుల బలయ్యారు. వీరిలో అత్యధికులు ముస్లింలు కావటం విశేషం.
ఈ సంఘటనకు ముందుగా ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరిన భారతీయ సైనికుల మీద బ్రిటిష్ పాలకులు జరిపిన విచారణ, విధించిన శిక్షలు కూడా రాయల్ ఇండియన్ నౌకాదళ తిరుగు బాటుకు దోహదమయ్యాయి. ఈ విచారణ సందర్భంగా జనాబ్ రషీద్ అలీకి విధించిన 7 సంవత్సరాలు కారాగారవాసం,త ఈవ్ర విమర్శకు గరైంది. ప్రజలు తీవ్ర నిరసను వ్యక్తం చేస్తూ కలకత్తా పట్టణంలో ఊరేగింపులు జరిపారు.
ఈ విధంగా రాయల్ ఇండియన్ నౌకాదళం అధికారుల, సైనికుల తిరుగుబాటు అగ్నికి ఆజ్యం తోడైనట్లయ్యింది. బ్రిటిష్ పాలకుల పునాదులు పూర్తిగా కదలి పోయాయనటానికి ప్రబల నిదర్శనంగా నిలిచిందీ తిరుగుబాటు. ఈ తిరుగుబాటును జాతీయ కాంగ్రెస్, ము స్లిం లీగ్‌లు వ్యతిరేకించాయి. తిరుగుబాటు సైనికులు మాత్రం కలస ికట్టుగా కాంగ్రెస్ లీగ్‌ల పతాకాలను నౌకల మీద కలసి ఎగుర వేశా రు. తిరుగబాటుదారులందర్నీ విధులకు హాజరు కావాల్సిందిగా జాతీ య కాంగ్రెస్ అధ్యక్షులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు సైనికుల మీద ఎటువంటి కక్ష సాధిం పు చర్యలకు పాల్పడకుండా ఆయన చూశారు.
1857 నాటి తిరుగుబాటు తీరులో ఈ తిరుగుబాటుకు ప్రజల మద్దతు లబించటంతో అగ్నికి వాయువు తోడైనట్టయ్యింది. కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు కూడా మద్దతు పలకటంతో 1857 నాటి ఐక్యమత్యం ప్రదర్శితమైంది. 1857 తిరుగుబాటు తరువాత, ఆంగ్లేయుల మూట ముల్లె సర్దుకుంటున్నప్పుడు మళ్ళీ సైనికులు తిరగబడటంతో అధికా రులు ఖంగుతిన్నారు. ప్రధాన నౌకా కేంద్రాలన్నిటిలో తిరుగుబాటు ప్రభా వం కన్పించింది. ఈ చర్యతో మండి పడిన అధికారులు తిరుగ బడిన జవానులు, ప్రజల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుపగా, ఆ కాల్పులలో అమరులైన వారిలో అ త్యధికులు ముస్లింలు కావటం విశేషం.