రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి : గంగుల కమలాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణవాదులను రెచ్చగొట్టే చర్యలు సీమాంధ్ర నేతలు మానుకోవలని టీఆర్‌ఎస్‌ నేత కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని అప్పుడు తెలంగాణ నేతలెవరూ బాధ్యులు కారని ఆయన స్పష్టం చేశారు.