తెలంగాణపై మరోమాట లేదు: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై మరోమాట లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ తేల్చి చెప్పారు. ఇంతవరకు వచ్చాక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ఆటంకం కలిగించొద్దని సీమాంధ్రులకు హితవు పలికారు. ఆంటోని కమిటీకి అందరూ తమ అభిప్రాయాలను తెలుపవచ్చని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఉద్యోగుల అభిప్రాయాలను ఆంటోని కమిటీ వింటుందని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశాల్లో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలం అని తెలిపాయని ఇప్పుడు వ్యతిరేకమంటే ఎలా అని ప్రశ్నించారు.