సీమాంధ్రలో హోరెత్తుతున్న సమైక్య వాదం
హైదరాబాద్ : రాష్ట్ర సమైక్యతను కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేపట్టిన ఆందోళన 22వ రోజూ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్ర సమైక్యతే ధ్యేయంగా సమైక్యవాదులంతా కలిసికట్టుగా రోడ్లపైకి వచ్చి తమ గొంతు విన్పిస్తున్నారు. దీక్షలు, ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు తదితర రూపాల్లో విభజన పట్ల తమ నిరసనను ప్రదర్శిస్తున్నారు.