నేడు తెలంగాణ పీఆర్‌టీయూ శాంతిదీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ఒక్కరోజు శాంతి దీక్షను చేపట్టనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, కోదండరామ్‌, దేవీశ్రీప్రసాదరావు, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ హాజరు కానున్నట్లు తెలిపారు. పది జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.