సీమాంధ్రుల దాడుల వెనుక సీఎం ,డీజీపి కుట్ర : శంకర్రావు
హైదరాబాద్: తెలంగాణవాదులపై ఏపీ ఎన్జీవోల దాడుల వెనుక సీఎం ,డీజీపి కుట్ర ఉందని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. సీఎం , డీజీపి కుట్ర చేసి సభకు అనుమతిచ్చారని ఆయన ఆరోపించారు.హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను ఎవరూ విడదీయలేరని తేల్చిచెప్పారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.