‘ టీ రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్లు ఉండరు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్లు ఉండరు. అందరూ ప్రభుత్వ లెక్చరర్లే ఉంటరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. ఇవాళ నగరంలో బీజేఆర్ ప్రభుత్వ కాలేజీలో తెలంగాణ పునర్ నిర్మాణం పై టీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సెమినర్‌లో ఆయన మాట్లాడారు. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ గుర్తిస్తామని హరీష్ తెలిపారు. ప్రతి వాద్యార్ధికి నాణ్యమైన విద్య అందే విధంగా చూస్తామన్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పేరుతో ఆర్టీసీ బస్సులను బంద్ పెట్టి మూడు వేల ప్రైవేట్ బస్సులను నడిపిస్తూ, సీమాంధ్రలో ఉన్న ఆర్టీసీ పేద కార్మికులను నిలువునా ముంచుతున్నారని హరీస్ రావు ఆరోపించారు. సీమాంధ్రలోని జిల్లా కోక యూనివర్సిటీ ఉన్నదని, తెలంగాణలో యూనివర్సిటీల కొరతతో ఉస్మానియాలోని 60 సీట్ల కోసం నాలుగు జిల్లాల్లోని 500పైగా కాలేజీ విద్యార్థులు పోటీపడే స్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



