బాధితులను ఆదుకుంటాం : ప్రధాని మన్మోహన్
ఉత్తరప్రదేశ్, సెప్టెంబర్ 16:ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఎఐసిసి ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ముజఫర్‌నగర్‌కు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ అల్లర్లు జరగడం దురదృష్టకరమన్నారు. బాధితులను ఆదుకుంటాం. అల్లర్లకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. యూపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.



