సీఎం కిరణ్‌తో మంత్రులు భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 16 : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాంత మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమకుమార్‌రెడ్డి సోమవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అలాగే సీమాంధ్ర ప్రాంత మంత్రి శైలజానాధ్, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.



