టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ
ముంబై ,సెప్టెంబర్ 16 :భారత క్రికెట్ జట్టు ఇకపై సరికొత్త లుక్‌తో కనబడనుంది. వన్డేలో టీమిండియా క్రికెటర్లు ధరించే కొత్త జెర్సీని నైక్ కంపెనీ ఆవిష్కరించింది. గతంతో పోలిస్తే మరింత కలర్‌ఫుల్‌గానూ , వేడిని తట్టుకునే విధంగానూ దీనిని రూపొందించినట్టు నైక్ తెలిపింది.దాదాపు రెండు నెలలుగా విరామం తీసుకున్న టీమిండియా వచ్చే అక్టోబర్‌లో ఆస్టేల్రియాతో జరిగే సిరీస్‌లో ఈ జెర్సీని ధరించనుంది. ఆసీస్ , భారత్ ఏడు వన్డేల సిరీస్ అక్టోబర్ 10న ప్రారంభమై… నవంబర్ 2న జరిగే టీ ట్వంటీతో ముగియనుంది. ఆడనున్నాయి. కాగా నైక్ ఆవిష్కరించిన కొత్త జెర్సీకి సంబంధించిన ఫోటోలను భారత యువక్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్ , ఉమేశ్ యాదవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.