లీగ్‌ టీ ట్వంటీ టోర్నీ టీ ట్వంటీ ఆడనున్న ధోనీ

రాంఛీ ,సెప్టెంబర్‌ 16 :భారత క్రికెట్‌ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ¬ంగ్రౌండ్‌లో తొలిసారి టీ ట్వంటీ మ్యాచ్‌ ఆడేందుకు సిధ్ధమయ్యాడు. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు ఈ సారి రాంఛీ కూడా ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్‌ 22న జరగనున్న రెండో మ్యాచ్‌లో చెన్నైసూపర్‌కింగ్స్‌ , టైటాన్స్‌తో తలపడనుంది. చెన్నైసూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్న ధోనీకి సొంతపట్టణంలో ఇదే తొలి టీ ట్వంటీ మ్యాచ్‌. ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఇక్కడ ఇంగ్లాండ్‌పై జరిగిన వన్డేలో ఆడినప్పటకీ… షార్ట్‌ ఫార్మేట్‌లో మాత్రం అవకాశం రాలేదు. ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా రాంఛీలో జరగకపోవడమే దీనికి కారణం. అయితే ఛాంపియన్స్‌ లీగ్‌ ప్రధాన టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా… గణెళిష్‌ నిమజ్జనం కారణంగా భద్రత కల్పించలేమని పోలీసులు వెల్లడించారు. దీంతో ఇవే మ్యాచ్‌లను రాంఛీ , మొహాలీకి తరలించారు.ప్రస్తుతం చాలాకాలం తర్వాత దొరికిన విశ్రాంతిని ఆస్వాదిస్తోన్న ధోనీ సెప్టెంబర్‌ 22 వరకూ రాంఛీలోనే ఉండనున్నాడు. అటు షార్ట్‌ ఫార్మేట్‌లో ధోనీ మెరుపులు చూసేందుకు జార్ఖండ్‌ క్రికెట్‌ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్‌ అమ్మకాలు కూడా ఊపందుకున్నట్టు జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది.