హైదరాబాద్ భూములపైనే ప్రేమ : వివేక్
హైదరాబాద్: సీమాంధ్ర బడా వ్యాపారులకు హైదరబాద్ పైనే ప్రేమ ఉందని ఎంపీ వివేక్ ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని భూముల కోసమే వారు పేచీ పెడెతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని వక్ప్ భూమిని ఆక్రమించి సీమాంధ్ర ఎంపీ లగడపాటి రిజగోపాల్ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో 97 కంపెనీలు పెట్టుబడులు పెడితే వాటిలో 78 అంర్జాతీయ కంపెనీలే ఉన్నాయని వివేక్ వివరించారు.



