ఎలాంటి పరిస్థితులైనా మనం ఎదుర్కోగలం


ఏ దేశమేగినా మూలాలు తెలుసుకోండి
ప్రణబ్‌ ఉద్భోద
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):
భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కునే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ‘భార్‌త్‌ను తెలుసుకో’ కార్యక్రమం జరిగింది. ఆయన 8 దేశాల నుంచి వచ్చిన 27 మంది భారత సంతతి యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ తన మూలాలను తెలుసుకోవాలని కోరారు. తనదైన సంస్కృతి, సంప్రదాయాలు, కళల ఆధార వ్యవస్థ నుంచి ప్రపంచ శక్తిగా భారత్‌ ఎలా పరిణామం చెందుతోందన్న విషయమై వారికి అవగాహన కల్పించారు. విదేశీ వ్యవహారాల శాఖ కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
21న అహింసా పరమోధర్మ
ఐక్యరాజ్య సమితి శాంతి దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న అహింస పరమో ధర్మ జాతీయ ప్రచార కార్యక్రమానిన ప్రణబ్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి వందమంది మత, ఆధ్యాత్మిక, విద్య, రాజకీయ, సామాజిక, పాత్రికేయ, వినోద రంగాల ప్రముఖులు, మహిళా సంఘాల నేతలు హాజరుకానున్నారు. 22న ఇక్కడి సిరిఫోర్ట్‌ ఆడిటోరియంలో ‘ఆధ్యాత్మిక జ్ఞానంతో హింసారహిత సమాజం’ అన్న అంశంపై సెమినార్‌ను ఏర్పాటు చేస్తారు.

తాజావార్తలు