విద్యార్ధిపై బ్లేడుతో దాడి
నిజామాబాద్: జిల్లా కేంద్రలోని గాయత్రి నగర్‌లో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువు తున్న విద్యార్థిని పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. విద్యార్థి గొంతును భ్లేడుతో కోశాడు. విద్యార్ధిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగులు పరారీ అయ్యాడు. విద్యార్ధిని తల్లి దండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



