నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు
మహాబూబ్‌నగర్ : కొత్తకోట బస్టాండ్‌లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్ శ్రీనివాసులు, హోంగార్డు నాగేంద్ర లను సస్పెండ్ చేసి నట్లు ఎస్పీ ప్రకటించారు. అత్యాచార ఘటనపై వనపర్తి డీఏస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని ఎస్పీ తెలిపారు.



