సమస్యలు పరిష్కరించుకోవచ్చు : కోదండరాం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనతో ఏవైనా సమస్యలు తలెత్తితే కమిటీలు వేసి పరిష్కరించుకోవచ్చని టీ జేఏసీ ఛైర్మెన్‌ కోదండరాం సూచించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతనికే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన శాంతి యుతంగా జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. విభజన తర్వాత రెండు ప్రాంతాల మధ్య సత్సంబంధాలు కొనసాగలని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.

తాజావార్తలు