భారతీయ చలన చిత్ర శత వసంత వేడేకలు ప్రారంభం
చెన్నై: భారతీయ చలన చిత్ర శత వసంత వేడుకలు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అట్టహసంగా ప్రారంభమయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు సీనియర్ నటీమణులు కాంచన, జమున, వైజయంతిమాల, సరోజాదేవి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలు 24న ముగియనున్నాయి.



