భక్తులతో కిటకిటలాడిన సిద్ధివినాయక ఆలయం
హైదరాబాద్ : స్వయంభుగా వెలసిన మెదక్‌జిల్లా న్యాల్‌కల్ మండలం రేజింతల్ సిద్ధి వినయక ఆలయంలో సంకట పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. మూడు నెలలకు ఒకసారి వచ్చే పర్వదినం రోజున జరిగే ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు.



