నేడు కేంద్ర కేబినేట్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం జరగనుంది. సాధారణంగా ప్రతివారం జరిగే మంత్రివర్గ సమావేశం గురువారం జరుగుతుంది. ప్రధాని బుధవారం అమెరికా పర్యటనకు బయల్దేరుతున్న నేపధ్యంలో రెండు రోజులు ముందుకు జరిపారు.     ఆర్థిక వ్యవహారాల కేబినేట్‌ కమిటీ సమావేశం కూడా జరగనుంది. సాధారణంగా అజెండా మాత్రమే చర్చకు ఉంది. శస్త్ర చికిత్స చేయించుకున్న రక్షణ మంత్రి ఆంటొని ఇంకా కోలుకొనే దశలోనే ఉన్నందున కీలకమైన అంశాలేవీ లేవని చెబుతున్నారు. నోట్‌ తన దగ్గకకు రాగానే సంతకం పెడతానని హోంమంత్రి ఇప్పటికి చెప్పారు.