పోలీసులకు పట్టుబడిన దోపిడి దొంగల ముఠా
హైదరాబాద్: దోపిడీలకు పాల్పడుతూ అడ్డువచ్చే వారిని అంతమొందించే పార్థిగ్యాంగుకు చెందిన సభ్యులను బాలానగర్ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. పది సంవత్సరాల క్రితం పేరుమోసిన ఈ మహారాష్ట్ర గ్యాంగు ఆనవాళ్లు నగరంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ కాలనీలో దాడికి పాల్పడే ప్రయత్నంలో చిక్కిన గ్యాంగు సభ్యుడు సలీం ఇచ్చిన సమాచారంతో కిష్టాపూర్ ప్రాంతంలో వారు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులు పట్టుబడ్డారు. వారివద్ద నుంచి మహరాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న సుమో, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.



