ఏపీ ఎన్జీవోస్ ఆఫీస్‌ను ముట్టడించిన జాగృతి కార్యకర్తలు
హైదరాబాద్ : అబిడ్స్‌లోని ఏపీ ఎన్జీవోస్ కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించారు. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎన్జీవోల కార్యలయాన్ని ముట్టడించిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యోగులను కించపరుస్తూ అశోక్‌బాబు మాట్లాడిన విషయం విదితమే.



