యువకున్ని హత్యచేసి రోడ్డుప్రమాదంగా మలిచేందుకు ప్రయత్నం

మెదక్‌ : యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని మెదక్‌-బోధన్‌ ప్రధాన రహదారి బోగుడభూపతిపూర్‌ అడవిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ గోధ్రు కథనం ప్రకారం మెదక్‌ మండల పరిధిలోని కప్రాయిపల్లికి చెందిన బోయిని లచ్చయ్య (32) మెదక్‌లోని ఏడీబీ బ్యాంక్‌లో పంట రుణాలను తీసుకున్నందుకు కిస్తీలు చెల్లించేందుకు బైక్‌పై మెదక్‌ బయలుదేరాడు.మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన తల్లి ఊశవ్వకు ఫోన్‌ చేసి నేను ఇంటికి వచ్చేది ఆలస్యమవుతుందని ఎదురు చూడవద్దని చెప్పాడు.సాయంత్రం 7గంటల సమయంలో కుటుంబ సభ్యులు లచ్చయ్యకు మరోసారి ఫోన్‌చేసిన కలువలేదు.మంగళవారం ఉదయం తెలిసిన వాళ్లు ,బందువల ఇళ్లలో వెతికారు.అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు భోదన్‌ -మెదక్‌ ప్రధాన రహదారిపై గాలించారు.పోలీసులకు బోగుడభూపతిపూర్‌ అడవిలో బైక్‌ కింద మృతదేహం ఉందన్న సమాచారం అందింది.అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరీశీలించగా లచ్చయ్య మృతదేహం గా గుర్తించారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు.ఇదిలా ఉండగా లచ్చయ్యకు గతంలోనే భార్యతో విడాకులు తీసుకున్నాడ. వీరికి ఒక కుమార్తె , ఒక కుమారుడు ఉన్నాడు.కాగా లచ్చయ్యకు మద్యం తాపి గొంతునులిమి పథకం ప్రకారం దుండగులు హత్యచేసి ఉంటారని తెలుస్తొంది.మద్యం తాపి తలపై బండరాయితో మోది గొంతునులిమి హత్యచేసి ఉంటారని మృతదేహనికి పోర్టుమార్టం చేసిన వైద్యుడోకరు తెలిపారు.