భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు : తబ్రేజ్

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకేసు విచారణలో ఎన్‌ఐఏ పురోగతి సాధించింది. ఎన్‌ఐఏ విచారణలో అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రయివేట్ ట్రావెల్స్‌లో మంగళూర్‌నుంచి వచ్చి రెక్కి నిర్వహించే వారని తెలిపాడు.అబిడ్స్,మలక్‌పేట్,దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కి నిర్వహించినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. మంగళూర్‌లోని యూనిట్ హెల్త్‌కేర్ వద్ద ఓ వ్యక్తి రియాజ్ భక్తల్ పేరుతో కొంత పేలుడు సామాగ్రిని అందజేశాడని చెప్పాడు.



