మైనర్ బాలికపై అత్యాచారం
ఖైరతాబాద్ (హైదరాబాద్) : ఖైరతాబాద్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై స్థానికంగా ఉండే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్‌లోని బాగీర్‌దార్ బడా బస్తీలో అద్దెకు ఉంటున్న జగదీశ్ అనే యువకుడు సమీపంలోని ఓ పాఠశాలలో చదువుతున్న 14ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను లొంగదీసుకుని కొంతకాలంగా అత్యాచారయత్నానికి పాల్పడుతున్నాడు. బాలికకు శుక్రవారం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు సైపాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.



