సకల జనుల సభకు ఖమ్మం నుంచి బయలుదేరిన తెలంగాణ వాదులు
హైదరాబాద్ : సకల జనుల భేరి సభను జయప్రదం చేసేందుకు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు.హైదరాబాద్‌లో తెలంగాణ ఐకాస ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సకలజనుల భేరిని విజయవంతం చేసేందుకు ఖమ్మం జిల్లా న్యూడెమోక్రసి,టీఆర్‌ఎస్,బీజేపీ, సీపీఐలతో పాటు ఉద్యోగులు, తెలంగాణ వాదులు భారీగా రాజధానికి పయనమయ్యారు.



