తెలంగాణ సభపై సీమాంధ్ర చానెళ్ల వివక్ష
హైదరాబాద్ : సీమాంధ్ర చానెళ్లు మరోసారి తమ వివక్షను చాటుకున్నాయి. ఇవాళ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ‘సకల జనుల భేరీ ‘ సభకు కవరేజ్ ఇవ్వడంలేదు. తెలంగాణ ప్రజల పట్ల సీమాంధ్ర మీడియా వివక్ష చూపిస్తుందని పలువురు తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు.ఏపీఎన్జీవోల సభకు పొద్దస్తమానం ప్రచారం ఇచ్చిన సీమాంధ్ర మీడియా లక్షల మంది తరలివస్తున్న సకల జనుల భేరికి కవరేజ్ ఇవ్వకపోవడం ఖచ్చితంగా తెలంగాణ పట్ల సీమాంధ్ర మీడియాకున్న పక్షపాత బుద్దిని కళ్లకు కడుతుంది.



