తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన యాజమాన్యం
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. ఈ దసరా పండగకు కార్మికులకు అడ్వాన్స్ ఇస్తామని ప్రకటించింది. సీమాంధ్రలో ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా యాజమాన్యం పండుగ అడ్వాన్స్‌లు ఇవ్వదేమోననే వార్తలకు దీంతో తెరపడింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రాంత కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.



