విద్యాశాఖ కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు

హైదరాబాద్‌ : పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఇవాళ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్‌లో జిల్లాలో పాఠశాలల మెడికల్‌ బిల్లులకు సంబంధించి నివేదిక ఇవ్వమని కోర్టు ఆదేశించినా అందుకు సంబంధించిన వివరాలను కమిషనర్‌ కోర్టుకు అందజేయలేదని న్యాయమూర్తి ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

తాజావార్తలు