సీఎం బరితెగించి బలుపుతో సమైక్యాంధ్ర అంటున్నాడు : ఈటెల


సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బరితెగించి జై సమైక్యాంధ్ర అంటున్నాడని ఈటెల ఆరోపించారు. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం జరుగుతుందని ,దాన్ని ముగ్గురు బాబులు, (కిరణ్‌, చంద్రబాబు ,జగన్‌)లు నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు.తెలంగాణలో జరుగుతున్నది ప్రజా ఉద్యమం ,ప్రజాస్వామిక ఉద్యమమని , ప్రజాస్వామ్య బద్దంగా సాగుతున్న ఉద్యమమని ,ప్రజా స్పందన ఉద్యమమని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహాగర్జన సదస్సు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉద్యమమని ఎకనామిక్స్‌ టైమ్స్‌ పత్రిక చెప్పిందని పేర్కొన్నారు.

తాజావార్తలు