ఎంబీయే, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల కేటాయింపు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంబీయే, ఎంసీయే కళాశాలల్లో సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. 29వేల ఎంబీయే, ఎంసీయే సీట్లు మిగిలిపోయినట్టు వారు తెలిపారు. 23 ఎంబీయే కళాశాలలు 109 ఎంసీయే కళాశాలల్లో ఒక్క విద్యార్ధి చేరలేదని వెల్లడించారు.



