కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్నం: ఒడిశా తీరాన్ని అనుకుని వాయవ్య బంగాశాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఇదే పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రత్యేకించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే వీలుందని ఆయా వర్గాలు వెల్లడించాయి.



