నేడు ఖైదీల విడుదల లేనట్లే!
హైదరాబాద్ : గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఖైదీల విడుదల లేదని తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న వారి విడుదల కోసం ప్రభుత్వం ఐదు రోజుల కిందటే జీవో జారీ చేసింది. అయితే ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం… అర్హులైన ఖైదీల జాబితా రూపకల్పనకు మరింత సమయం అవసరం. దీంతో వారి బంధువులకు నిరాశే మిగిలింది. అర్హుల జాబితాన ఈనెల 26 నాటికి ప్రభుత్వానికి పంపనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ చెప్పారు. ఆ తర్వాతే దీనిపై సర్కారు నిర్ణయం తీసుకుంటుంది.



