ప్రేమించిన అమ్మాయితో పెళ్లికాదేమోనని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌ : యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్‌ మీడియాలో పెట్టి మరి చనిపోయాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా మబ్బుగుంటపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ ,కనకమ్మల కుమారుడు వేణు(25), స్థానికంగా బీటెక్‌ చదువుతున్న క్రమంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆరు నెలల క్రితం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఎన్‌ఎల్‌బీనగర్‌కు వచ్చి తన స్నేహితులతో కలిసి ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రేమించిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకపోవడం లేదని బుధవారం స్నేహితులకు ఫేస్‌బుక్‌లో మెస్సేజ్‌ పోస్ట్‌ చేసి తాను చనిపోతున్నానని అందులో పేర్కొన్నారు.బుధవారం స్నేహితుడు అనిల్‌ డ్యూటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి వేణు ప్యాన్‌ వేళాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు