తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు :దిగ్విజయ్‌సింగ్

న్యూఢిల్లీ : సీడబ్య్లూసీ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఆంటోని కమిటిని ఏర్పాటు చేసింది రాష్ట్ర విభజనపై సీడబ్య్లూసీ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడానికి కాదని, కేవలం రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యల గురించి తెలుసుకోవడానికి మాత్రమేనని ఆయన తెలిపారు. గురువారం జరిగే కేబినేట్ సమావేశం ముందుకు తెలంగాణ నోట్ వస్తుందో రాదో తనకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ నోట్ అంశం కేంద్రం చూసుకుంటుందని స్పష్టం చేశారు.



