చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదుల దాడి…. కానిస్టేబుల్ మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో అల్ ఉమా ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో తమిళనాడు ,ఆంధ్రా పోలీసులు దాడి చేయగా … ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించాడు. ఓ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న ఇంట్లో నలుగురి వరకూ అల్ ఉమా ఉగ్రవాదులున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్టోపస్ బలగాలను అక్కడకు తరలించినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సుమారు 30మంది అక్టోపస్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.



