తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల నవదుర్గ ఆలయంలో దేవీశన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు కనకదుర్గ దేవిగా దర్శనమివ్వనున్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శైలిపుత్రి అలంకారంలో రాజేశ్వరి అమ్మవారు దర్శనమివ్వనున్నారు.వరంగల్ భద్రకాళీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆదిలక్ష్మి అవతారంలో సీతమ్మవారు దర్శనమివ్వనున్నారు. బాసరలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అలంపూర్ జోగులాంబ దేవాలయంలో బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి.



