పెంపుడు తండ్రే కాలయముడు : కూతురిపై అఘాయిత్యం

హైదరాబాద్‌ : తండ్రే కీచకుడయ్యాడు …. పెంపుడు కూతుర్ని చెరబట్టి గర్భవతిని చేశాడు. ఆ దుర్మార్గున్ని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్ధానిక దుబాయ్‌ గేట్‌ సమీపంలో ఉండే ఓ వ్యక్తి తమ కూతురుని చిన్నతనంలోనే శ్రీకాకుళంలో ఉండే తోడల్లుడు రామ్మూర్త కి దత్తత ఇచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 22 ఏళ్లు . మూడేళ్ల క్రితం తన భార్య గర్భం దాల్చిన సమయంలో రామ్మూర్తి చూపు పెంచుకుంటున్న కూతురిపై పడింది. అప్పటి నుంచి ఆమెను బలవంతంగా అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చిన సమయంలో రామ్మూర్తి చూపు పెంచుకుంటున్న కూతురిపై పడింది.అప్పటి నుంచి ఆమెను బలవంతంగా అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో గొడవపడి అమ్మాయిని సొంత తల్లిదండ్రుల వద్ద వదిలేసి రమ్మని ఒత్తిడి చేసింది. దీంతో ఇటీవల బోయిన్‌పల్లికి వచ్చిన రామ్మూర్తి …అమ్మాయి చెడుతిరుగుళ్లకు అలవాటుపడిందంటూ నిందవేయడంతో పాటు మీ కూతుర్ని పంపేస్తానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు.దీంతో వారు కూతురిని ఫోన్‌లో నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. తాను పెంపుడు తండ్రి కారణంగానే గర్భం దాల్చానని బోరుమంది. ఆమె తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీసులను ఆశ్రయించగా వారు బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.