అటవీ స్మగ్లర్లపై కఠినచర్యలు :సీఎం
హైదరాబాద్ : అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లు ,జంతు వేటగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు సమకూర్చడానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను సీఎం ప్రారంభించారు. దీంతో పాటు జూపార్కులో భారీ నెహ్రూ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.



