మరింత దోచుకునేందుకే జగన్ దీక్ష : టీఆర్‌ఎస్ నేత కడియం
హైదరాబాద్ : తెలంగాణను అడ్డుకుని మరింత దోచుకునేందుకు జగన్ దీక్ష చేస్తున్నారని తెరాస నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. హైదరాబాద్‌లో జగన్, ఢిల్లీలో చంద్రబాబు దీక్షలు వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకేనని వరంగల్‌లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్కీంల పేరిట స్కాంలు చేసేందుకు జగన్ దీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారంటూ మండి పడ్డారు. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.



