విజయనగరం ఘటనలపై అధిష్టానం పెద్దల దృష్టి : జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కేంద్రం

హైదరాబాద్‌ : విజయనగరంలో నిన్న జరిగిన విధ్వంసకర ఘటనలపై కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలు ఆరా తీశారు. సమైక్యాంధ్ర కోరుతూ చేస్తోన్న ఉద్యమంలో నిన్న చోటుచేసుకున్న అరాచక ఘటనల గురించి వారు ఇక్కడి నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు మరోనేత గులాం నబీ ఆజాద్‌ ,అహ్మద్‌ పటేల్‌ తదితరులు బొత్స సత్యనారాయణకు ఫోన్‌ చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తాజావార్తలు