70 ఇసుక లారీల పట్టివేత

విజయవాడ: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల వద్ద కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 70 లారీలను అధికారులు పట్టుకున్నారు.గత కొన్ని రోజులుగా కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుకను హైదరాబాద్‌ తరలిస్తున్నారు. దీంతో సమాచారమందుకున్న అధికారులు లారీలను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.