ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్‌సీకి సమర్పించిన డిస్కంలు
హైదరాబాద్: 2014-15లో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్‌సీకా సమర్పిచాయి. ఈ ప్రతిపాదనల్లో డిస్కంలు ఛార్జీల మోత మోగించాయి. గృహ వినియోగదారులపై సరాసరిన యూనిట్‌కు రూ. 1.25 పైసల వరకు పెంచాలని చెప్పారు. నాలుగు డిస్కంలకు వాన్షిక రుణ అవసరం 52,753 కోట్లు కాగా దీనిలో విద్యుత్ చార్జీల రూపంలో 36,345 కోట్ల రూపాయల రాబడి ఉందని చెబుతూ 16,409 కోట్ల రూపాయల లోటు ఏర్పడిందని ప్రతిపాదనల్లో చూపించారు. విద్యుత్ డిమాండ్ సరఫరాలో కూడా 13464 మిలియన్ యూనిట్లు కొరత ఏర్పడుతుందని డిస్కంలు చెప్పాయి. లోటు ఏర్పడిన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపాయి. 2014-15లో వ్యవసాయ తదితర విద్యుత్ వినియోగదారులకు రాయితీల కింద 7089 కోట్లు ప్రబుత్వం ఇచ్చే అవకాశం ఉందని డిస్కంలు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు సమర్పించాయి.