సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయడాన్ని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సచివాలయంఎల్‌ బ్లాక్‌ వద్ద విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల చేతగానితనం వల్లే విభజన ప్రకియ ముందుకు పోతోందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను పాటించకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర ఉద్యోగులు విమర్శించారు. తక్షణం కేంద్ర కేబినేట్‌, సీడబ్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విభజన ప్రక్రియ ఇక నుంచి ముందుకు పోకుండా అడ్డుకునేందుకు సీమాంధ్ర నినాదాలతో సచివాలయ ప్రాంగణం మారుమోగింది. ఎల్‌ బ్లాక్‌ నుంచి సి బ్లాక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.