పెను తుపానుగా ‘మాది’

విశాఖపట్నం, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :
బంగాళాఖాతంలో ఏర్పడిన మాది తుపాను తీవ్రరూపం దాల్చింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. మాది తుపాను నెమ్మదిగా ఉత్తర దిశగా పయనిస్తుందని తెలిపింది. మాది నేపథ్యంలో అన్ని ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లంగా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుఉల వీస్తాయని, మాది ప్రభావం గత తుపాన్ల కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెహర్‌ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే రెండో తుపాను ఏర్పడటంతో రాష్ట్ర ప్రజలు ఆందోళనతో వణికిపోతున్నారు.